కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలకు యుద్ధం ఓ ఆప్షన్ కాదని, చర్చల ద్వారా భారత్‌తో శాశ్వత శాంతి నెలకొనాలని పాకిస్థాన్ కోరుకుంటోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం మీడియా కథనంలో పేర్కొన్నారు.
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ పరీక్ష నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని సర్కారు నిర్ణయించుకుంది.
ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఆగ్రా కళాశాల ప్రవేశ ద్వారం తెరవకపోవడంతో ఎగ్జిబిషన్‌కు హాజరుకాకుండానే తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొందరికి పూటగడవడమే కష్టంగా మారింది. జాతీయ టోర్నమెంట్లలో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబుది కూడా అదే పరిస్థితి. రాజబాబు అనే విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ ఇప్పుడు ఘజియాబాద్‌లో ఇ-రిక్షా నడుపుతూ పాలు అమ్ముతున్నాడు.
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి యాత్ర ఇవాళ పున:ప్రారంభం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా శనివారం సాయంత్రం నుంచి ఈ యాత్రను నిలిపివేశారు.
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మిగిలి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి మంత్రివర్గంలో పెద్ద మార్పు చేసింది. రాజేంద్ర త్రివేది నుంచి రెవెన్యూ శాఖ, పూర్ణేష్ మోదీ నుంచి రోడ్డు, భవనాల శాఖను తొలగించారు.