ఆసియా కప్ 2022 ట్రోఫీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ బోర్డు ఛైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఆవిష్కరించారని యూఈఏ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
సోమాలియా రాజధాని మొగదిషులోని హయత్ హోటల్‌పై అల్-షబాబ్ ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 30 గంటలపాటు కొనసాగిన అల్-షబాబ్ జిహాదీల ఘోరమైన ముట్టడిని సోమాలియా దళాలు ముగించాయని శనివారం అర్ధరాత్రి భద్రతా కమాండర్ మీడియాతో వెల్లడించారు.
ముంబైలో మళ్లీ 26/11 తరహా ఉగ్రదాడికి పాల్పడతామంటూ అగంతుకులు నుంచి బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నంబరుకు పాకిస్థాన్ కోడ్ ఉండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
న్యూయార్క్ టైమ్స్‌లో ఢిల్లీ విద్యా విధానంపై ఆర్టికల్ రాశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. ఇది తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని.. టీచర్ల ద్వారా విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందన్నారు. నిన్న తన నివాసంతో పాటు సచివాలయం కార్యాలయంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. తాను కాంగ్రెస్ నాయకుడిని కలిశానని, తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు.
హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్లిస్తున్న వ్యక్తిని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, అల్-బదర్‌లకు డబ్బును మళ్లించినట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ హెచ్‌జిఎస్ ధాలివాల్ వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలో ఉన్న చక్కి వంతెన శనివారం కూలిపోయిందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ఉదయం రాష్ట్రంలోని మండి జిల్లాలో తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి.
ల్లీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు జరిపిన కొన్ని గంటల తర్వాత శుక్రవారం ఒక డజను మంది ఐఏఎస్ అధికారులను శాఖల మధ్య బదిలీ చేశారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్రదాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది.