Gujarat: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మిగిలి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి మంత్రివర్గంలో పెద్ద మార్పు చేసింది. రాజేంద్ర త్రివేది నుంచి రెవెన్యూ శాఖ, పూర్ణేష్ మోదీ నుంచి రోడ్డు, భవనాల శాఖను తొలగించారు. రెండు మంత్రిత్వ శాఖలను ఇప్పుడు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం త్రివేది లా అండ్ జస్టిస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, లెజిస్లేటివ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కొనసాగిస్తారు మరియు పూర్ణేష్ మోడీ రవాణా, పౌర విమానయానం, పర్యాటకం, తీర్థయాత్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తారు. హర్ష్ రమేష్‌కుమార్ సంఘవికి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించగా.. జగదీష్ ఈశ్వర్ పంచల్‌కు రాష్ట్ర మంత్రిగా రోడ్డు, భవనాల శాఖను అప్పగించారు.
Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్
రెవిన్యూ శాఖ నుండి తొలగించబడిన రాజేంద్ర త్రివేది గుజరాత్ ప్రభుత్వంలో కీలక నేతగా పరిగణించబడటం గమనార్హం. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త్రివేది రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో శాఖకు చెందిన పలు కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆకస్మిక తనిఖీల కారణంగా ఆయన వార్తల్లో నిలిచారు. రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోడీ ఇద్దరూ భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని పది మంది కేబినెట్ మంత్రులలో ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.