Vaishnodevi Yatra: జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి యాత్ర ఇవాళ పున:ప్రారంభం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా శనివారం సాయంత్రం నుంచి ఈ యాత్రను నిలిపివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాత్రను ఆగస్టు 21 ఉదయం వరకు నిలిపివేసినట్లు మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు శనివారం తెలిపింది. భారీ వర్షాల కారణంగా పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఇప్పటికే అక్కడ మోహరించడం గమనార్హం. పరిస్థితిని బోర్డు పర్యవేక్షిస్తోంది.
Gujarat: గుజరాత్ మంత్రివర్గంలో భారీ మార్పు.. వారిని ఆ శాఖల నుంచి తొలగింపు
అంతకుముందు జూలైలో అమర్‌నాథ్ పవిత్ర గుహ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది, దీని ఫలితంగా పవిత్ర గుహను ఆనుకుని భారీగా వరదలు సంభవించాయి. అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గం దెబ్బతినడంతో కొంతకాలం యాత్రను నిలిపివేశారు. భారత వైమానికి దళానికి చెందిన సిబ్బంది అక్కడ చిక్కుకున్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు.