ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ శనివారం డ్రగ్ టెస్ట్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ టెస్ట్‌కు సంబంధించిన రిపోర్టు ఇవాళ వచ్చింది.
శివసేన పార్టీ చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ నేవీ ఇవాళ ఒడిశా తీరంలోని ఛాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) ను విజయవంతంగా పరీక్షించాయి.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిశారు.
విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ అరుదైన సమస్యకు చోటుచేసుకుంది. 30 నిమిషాల పాటు ఎండలో నిద్రపోయిన 25 ఏళ్ల యువతి నుదిటి చర్మం ప్లాస్టిక్‌లా మారడంతో భయాందోళనకు గురైంది. ఈ ఘటన బల్గేరియాలో చోటుచేసుకుంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారం ప్రకంపనలు సృషిస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో దుర్గాపూజ నిర్వహణ కమిటీల గ్రాంట్‌ను రూ.50,000 నుంచి రూ.60,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సీఎం బెనర్జీ సెలవులు కూడా ప్రకటించారు.
ఓ వ్యక్తి స్నేహితులతో సరదాగా మందు తాగుదామని కూర్చున్నాడు. అందరూ కలిసి కలిసి మద్యం సేవించారు. అప్పటివరకు సరదాగా ఉండి మద్యం మత్తులో స్నేహితుడి మలద్వారం స్టీల్ గ్లాసును చొప్పించారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలోని బెరంపూర్‌లో చోటుచేసుకుంది.