Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాపై సీబీఐ లుకౌట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ప్రథమ ముద్దాయిగా సిసోడియా పేరును చేర్చింది. తాజాగా వీరిలో 13మందిపై సిబిఐ లుకౌట్ నోటీసుల్చింది. దీంతో వీరిపై విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. లుకౌట్ నోటీసు ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు.
ఈ నోటీసుపై సిసోడియా స్పందిస్తూ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఇదేం డ్రామా అంటూ మండిపడ్డారు. “మీరు చేసిన దాడులన్నీ విఫలమయ్యాయి, ఒక్క పైసా కూడా దొరకని ఫౌల్ ప్లే ఇప్పుడు, మీరు మనీష్ సిసోడియా పరారీలో ఉన్నారని లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసారు, ఇది ఏమి జిమ్మిక్, మోడీ జీ? నేను బహిరంగంగా తిరుగుతున్నాను. ఢిల్లీలో, నేను ఎక్కడికి రావాలి చెప్పు?” ప్రధాని నరేంద్ర మోదీపై హిందీలో దాడి చేస్తూ సిసోడియా ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు ఏడు రాష్ట్రాలతో సహా 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో పాటు బ్యాంకు లావాదేవీల వెరిఫికేషన్ ప్రక్రియను దర్యాప్తు సంస్థ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.సిసోడియా, అర్వా గోపీ కృష్ణ, ఆనంద్ తివారీ, పంకజ్ భట్నాగర్ 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను సిఫారసు చేయడంలో మరియు తీసుకోవడంలో కీలకంగా ఉన్నారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..