Uttarpradesh: ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఆగ్రా కళాశాల ప్రవేశ ద్వారం తెరవకపోవడంతో ఎగ్జిబిషన్‌కు హాజరుకాకుండానే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వివరాలు పరిశీలిస్తే.. ఆగ్రాలోని ఓ కళాశాలలో శనివారం పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకు మంత్రి ఉపాధ్యాయ అక్కడకు చేరుకున్నారు. ఎంతకీ గేటు తెరవకపోవడంతో ఆయన అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం విచారణకు ఆదేశించి, ఎగ్జిబిషన్ నిర్వహించిన అధ్యాపకులను వివరణ కోరింది.
Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాపై సీబీఐ లుకౌట్ నోటీసులు
పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం ఆహ్వానించబడిన మంత్రి కళాశాల గేట్ వద్ద 15 నిమిషాలు వేచి ఉన్నారని పలు వర్గాలు తెలిపాయి. కళాశాల గేటు తెరవలేదని, ఆయన చిరాకుగా తిరిగివచ్చాడని వెల్లడించాయి. కళాశాల ప్రిన్సిపాల్ అనురాగ్ శుక్లాను వివరణ కోరగా.. డ్రాయింగ్, పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ఓ ఫ్యాకల్టీ ఎన్జీవో సహకారంతో ప్రైవేటుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కళాశాలలో ఇంటర్నల్ పరీక్షలు కూడా ఉండడంతో తీవ్రమైన వాహనాల రద్దీ ఏర్పడినట్టు వివరించారు. దీనివల్ల అలాంటి దురదృష్టకర ఘటన జరిగినట్టు తెలిపారు. ప్రదర్శనను నిర్వహించిన టీచర్ నుంచి వివరణ కోరినట్టు చెప్పారు. లోపాలపై అధ్యయనానికి కమిటీని నియమించినట్టు తెలిపారు. మంత్రికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆయన తెలిపారు.