భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు.
సోమాలియా రాజధాని మొగదిషు కేంద్రంగా ఉన్న హోటల్‌ను ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ శనివారం స్వాధీనం చేసుకుంది. సోమాలియా రాజధానిలో రెండు కారు బాంబు పేలుళ్లు, కాల్పుల తర్వాత సాయుధ సమూహం అల్-షబాబ్ బాధ్యత వహించినట్లు అల్ జజీరా నివేదించింది.
శుక్రవారం జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గల ఓ ఆలయంలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా రద్దీ కారణంగా ఇద్దరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు రాయ్‌పూర్ బ్లాక్‌లో సర్ఖేత్ గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. వరదలు ఆ గ్రామాన్ని అల్లకల్లోలం చేశాయి.
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
మంకీపాక్స్ పరీక్ష కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (AMTZ)లో ప్రారంభించారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా బయో-మెడికల్స్ అభివృద్ధి చేసిన ఈ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు.
మహారాష్ట్ర ముంబైలోని బోరివాలిలో ఇవాళ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. బోరివాలి వెస్ట్‌లోని సాయిబాబా నగర్‌లో భవనం కుప్పకూలగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని తనిఖీ చేపట్టారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఉన్న కోరిక గురించి వివరించారు. తాను కూడా సైన్యంలో చేరాలని అనుకున్నానని, అయితే తన కుటుంబంలోని ఇబ్బందుల కారణంగా కుదరలేదని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.
సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై దాడులు చేయగా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన జాతీయ మిషన్‌లో చేరాలని కోరుతూ 'మిస్డ్ కాల్' ప్రచారాన్ని ప్రారంభించారు.