శ్రీలంకలో చైనా నిర్మించిన హంబన్‌తోట ఓడరేవు వద్ద ఓడరేవుకు చేరుకున్న చైనా సైనిక సర్వే నౌక వారం రోజుల తర్వాత సోమవారం తిరుగు ప్రయాణమైంది. ఈ నౌక శ్రీలంకకు రావడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
భారతదేశంలో లంపి చర్మ వ్యాధి బారిన పడే జంతువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 1.85 లక్షలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి.
''భారత్ జోడో'' పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచినందుకుగానూ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. అయితే రాజకీయ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని ఆయన ఆరోపించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ సోమవారం 21,000 టన్నుల ఎరువులను అందజేసింది.
పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు. సోమవారం ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు అతని కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది.
శనివారం జరిగిన ఇస్లామాబాద్ ర్యాలీలో పోలీసులు, న్యాయవ్యవస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలను బెదిరించినందుకు అతనిపై నమోదైన ఉగ్రవాద కేసులో పాకిస్తాన్ బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు గురువారం వరకు రక్షణ బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని ఆయన వెల్లడించారు.