Mamata Banerjee: బంగ్లాదేశ్ నయా సారథి తారిఖ్ రెహమాన్‌కు మమతా బెనర్జీ సర్ప్రైజ్ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh- Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక సారథి యూనస్ శకం ముగిసింది. తాజాగా జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత తారిక్ రహ్మాన్ ఘన విజయం సాధించారు. ఇప్పటికే మన దేశ ప్రధాని మోడీ తారిక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. బంగ్లాదేశ్ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తారిక్‌కు గిఫ్ట్ పంపారు. ప్రత్యేకంగా పూలు, మిఠాయిలు పంపించి అభినందనలు తెలిపారు. ఈ బహుమతులను ఢాకాలోని గుల్షన్‌లోని పార్టీ కార్యాలయంలో బీఎన్‌పీ ప్రతినిధులు స్వీకరించారు. ఇదివరకే ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రమజాన్ శుభాకాంక్షలు ముందుగానే చెప్పారు. తారిక్ రహ్మాన్‌ను “తారిక్ భాయ్” అని పిలుస్తూ.. పార్టీ విజయంపై ప్రత్యేక అభినందనలు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇలాగే బలంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Mitchell Starc: భారత్‌ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ గురువారం ముగిసింది. అనంతరం బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం 300 స్థానాల్లో 297 స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. అందులో బీఎన్‌పీ, దాని మిత్రపక్షాలు కలిసి 212 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించాయి. జమాత్-ఎ-ఇస్లామీ ఆధ్వర్యంలోని 11 పార్టీల కూటమి 77 స్థానాలు గెలుచుకుంది. ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ ఒక స్థానం దక్కించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టైంది. ఒకవైపు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆప్యాయ శుభాకాంక్షలు, మరోవైపు భారత ప్రధాని అభినందనలు తెలపడం ఆసక్తికరంగా మారింది. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
READ MORE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ మైలేజ్.. త్వరలో Tata Punch EV లాంచ్
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!