'థగ్స్' చిత్రానికి సంబంధించిన క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను చెన్నైలో భారీ వేడుకలో విడుదల చేశారు. ఆర్య, భాగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళామాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ వీడియోను విడుదల చేశారు.
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ లంపి చర్మ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 57,000 పశువులు చనిపోయాయని, వ్యాధిని నియంత్రించడానికి టీకా ప్రక్రియను పెంచాలని బాధిత రాష్ట్రాలను కేంద్రం గురువారం కోరింది.
ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) దివంగత జనరల్ బిపిన్ రావత్ గౌరవార్థం అరుణాచల్‌లోని కిబితు మిలిటరీ గార్రిసన్‌కు ఆయన పేరు పెట్టారు. కిబితులోని సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు.
జీవితంలో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ.. 75 శాతం మేధో వైకల్యంతో పాటు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ 14 ఏళ్ల బాలిక జీవితాన్ని యోగా మార్చేసింది. ఆమె ఎవరో కాదు 'రబ్బర్ గర్ల్'గా పేరొందిన అన్వీ విజయ్ జంజారుకియా. ఆమె నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని ముందు అన్వీ యోగాను ప్రదర్శించారు.
విదేశీ టీ-షర్టు ధరించి దేశాన్ని ఏకం చేసే భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. 'భారత్ జోడో యాత్ర'లో ద్రవ్యోల్బణం అంశాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. స్వయంగా రూ. 41,257 విలువ చేసే టీషర్ట్‌ను ధరించారని, అది కూడా విదేశీ బ్రాండ్‌కు చెందినదని పేర్కొంటూ బీజేపీ శుక్రవారం సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై దాడి చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కౌశాంబికి చెందిన సంపత్(32) అనే భక్తుడు మా శీత్లా ఆలయంలో తన నాలుకను కోసుకుని స్వామివారికి సమర్పించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
బ్రిటన్‌ను ఎక్కువ కాలం ఏలిన రాణి ఎలిజబెత్-2 కన్నుమూయడంతో ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్-3కి సింహాసనం బదిలీ అయింది. ఇకపై ఆయనను కింగ్ చార్లెస్ 3 పేరుతో వ్యవహరిస్తారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ భేటీలో కింగ్ చార్లెస్-3ను బ్రిటన్ కొత్త చక్రవర్తిగా ప్రకటించారు.