కేరళలో కన్నూర్‌లోని చావస్సేరిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకర్త ఇంటి ముందు గురువారం రాత్రి బాంబు పేలింది. మట్టన్నూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సుధీష్ ఇంటికి 50 మీటర్ల దూరంలో బాంబు పేలింది.
పంజాబ్‌లో తన సీనియర్ తనను అవమానించాడని ఆరోపిస్తూ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు.
కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఈరోజు తాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేసిన వేళ అమిత్ షాను 'ఇండియాలోనే అతిపెద్ద పప్పు' అని కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్‌తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవలే ముగించుకున్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, తన మాజీ పార్టీకి చెందిన నాయకులు తనపై క్షిపణులు ప్రయోగించినప్పుడు మాత్రమే తాను రైఫిల్‌తో ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు.
అండర్ గ్రాడ్యుయేట్‌ల కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 15 నాటికి ప్రకటించాలని భావిస్తున్నట్లు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని రిషికేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రిషికేశ్-బద్రీనాథ్ రహదారిపై బ్రహ్మపురి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ కారు లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దాదాపు 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ ఐదేళ్ల క్రితం ఏమైందో ఏమో..
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా.. స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.