Thugs Movie: దర్శకధీరుడు రాజమౌళి మెచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thugs Movie: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృంద గోపాల్ డైరెక్షన్‌లో.. పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్, 130కి పైగా సినిమాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం ‘థగ్స్’. ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా.. సింహ, ఆర్‌కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్‌గా, జోసెఫ్ నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఈ ”థగ్స్” చిత్రం రూపొందుతోంది.
‘థగ్స్’ చిత్రానికి సంబంధించిన క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను చెన్నైలో భారీ వేడుకలో విడుదల చేశారు. ఆర్య, భాగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళామాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ వేడుకకు హాజరైన వారందరూ ”థగ్స్” సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘క్యారక్టర్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్’గా విడుదల అయిన ఈ వీడియోలో చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.‘మాస్టర్ మైండ్’ సేతుగా హృదు, ‘రోగ్’ దురైగా సింహ, ‘బ్రూట్’ ఆరాకియా దాస్‌గా ఆర్‌కే సురేష్, ‘క్రుకెడ్’ మరుదుగా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. వీడియో ఆద్యంతం శామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్‌ను ఎలివేట్ చేసేలా సాగింది. ఇందులో కనిపించిన యాక్షన్ సన్నివేశాలను బట్టి చూస్తే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగేలా చిత్రమని అర్థమవుతోంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి వీడియో బైట్‌లో హీరో మృదుకు తన బెస్ట్ విషెస్ చెప్పారు. థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రాజమౌళి వెల్లడించారు. నవంబర్‌లో థియేటర్లలో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
Ponniyin Selvan: I : మణిరత్నంపై హృతిక్, ధనుష్ దాడి
గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో పలువురు ప్రముఖులు మాట్లాడారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నటుడు ఆర్య మాట్లాడుతూ.. ”బృందా మాస్టర్‌తో కలిసి చాలా సినిమాల్లో పనిచేశాను. ఆమె నిజ స్వభావం ఎల్లప్పుడూ యాక్షన్‌తో కూడి ఉంటుంది. అది ఈ చిత్రంలో ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, అది సినిమా టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాత షిబు థమీన్స్ తాను చేసే ప్రతి పనిలో ఎప్పుడూ ప్రత్యేకతను ఆశిస్తారని, ‘థగ్స్’ ఆయన అంచనాలను తప్పకుండా నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది. సినిమా రాక కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. ”బృందా రాక్షసి. నా సినిమాల్లో పాటలన్నీ బాగా రావడానికి ఆమె కూడా ఒక కారణం. ‘వేటయ్యాడు విళయ్యాడు’లోని ‘కర్క కర్క’ పాటలో యాక్షన్ షాట్‌లకు కొరియోగ్రఫీ చేసింది ఆమె. ఆమె ఓ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించబోతోందని వారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సినిమాతో ఆమె కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’లో హృదు హరూన్ అద్భుతమైన నటనతో నన్ను ఆకట్టుకున్నాడు. థగ్స్‌లో కూడా అతని అద్భుతమైన నటనను చూడాలని నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. . టీమ్ మొత్తానికి ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!