ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత మేనిఫెస్టో అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి హామీ మతగ్రంథంగా పవిత్రంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు పవిత్రమైనవిగా భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
దేశాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో విద్యాబోధన జరగాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిశ్రమలకు ఏం అవసరమో భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశ్రమలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న విద్యార్థులను విద్యా సంస్థలు ఉత్పత్తి చేయాలని సూచించారు.
ఈ రోజు రెబెల్ స్టార్‌ని కోల్పోవడం బాధేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు భౌతికకాయం వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది.
రాజ్‌పథ్ పేరును కర్తవ్య మార్గంగా మార్చడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ శనివారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని రాజ్‌భవన్‌లను కూడా కర్తవ్య భవన్‌లుగా మార్చకూడదా అని ప్రశ్నించారు.
కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు.
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో 14 మంది నీటిలో మునిగి మరణించారని పోలీసులు వెల్లడించారు.