ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక జట్టు ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్‌పై 23 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దీంతో 15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది.
ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ సదస్సుకు చైనా, రష్యా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్తాన్ ప్రధానులు హాజరుకానుండడమే.
ఈ యుద్ధంలో రష్యాకు ఉక్రెయిన్ సేనలు భారీ షాకిచ్చాయి. ఉక్రెయిన్‌లోని ఖార్ఖీవ్ ప్రావిన్స్‌లో కీలక నగరమైన ఇజియంను రష్యా నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
ఉత్తరాంధ్రలో పాదయాత్ర ద్వారా అక్కడ అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతులకు వివాహ సహకారం కోసం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.