దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,093మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
నూకల ఎగుమతిపై భారత్ తక్షణ నిషేధం విధించింది. ఎగుమతి విధానం ఉచితం నుంచి నిషిద్ధంగా సవరించబడింది. అయితే, కొన్ని ఎగుమతులు సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయి.
స్టార్ ఇండియన్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం మరో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.
యూకేను ఎక్కువ కాలం పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్-2 తన 96 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కన్నుమూసినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు తెల్లవారుజామున రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో బాల్మోరల్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ప్యాలెస్ తెలిపింది.
ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన అప్ఘాన్ సేన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు.