Amit Shah: విదేశీ టీ-షర్టు ధరించి భారత్ జోడో యాత్రకు బయలుదేరారు.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: విదేశీ టీ-షర్టు ధరించి దేశాన్ని ఏకం చేసే భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ‘భారత్ జోడో యాత్ర’లో ద్రవ్యోల్బణం అంశాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. స్వయంగా రూ. 41,257 విలువ చేసే టీషర్ట్‌ను ధరించారని, అది కూడా విదేశీ బ్రాండ్‌కు చెందినదని పేర్కొంటూ బీజేపీ శుక్రవారం సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై దాడి చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ మిషన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని బీజేపీ తెలిపింది. “భారతదేశం ఒక దేశం కాదు” అని పార్లమెంటులో గాంధీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసిన షా, ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని, భారతదేశ చరిత్రను అధ్యయనం చేయమని కాంగ్రెస్ నాయకుడిని కోరారు.
“రాహుల్ గాంధీ విదేశీ టీషర్టు ధరించి భారత్ జోడో యాత్రకు బయలుదేరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సభ్యులు ఆయన పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నాను. రాహుల్ బాబా భారతదేశం ఒక దేశం కాదని అన్నారు. రాహుల్ గాంధీ, మీరు ఏ పుస్తకంలో చదివారు. లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేసిన దేశం ఇది. రాహుల్ గాంధీ భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాలి” అని జోధ్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయలేదన్న ఆయన.. కేవలం బుజ్జగింపు, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే పని చేస్తుందన్నారు.
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
రాజస్థాన్‌లో అత్యధిక ఇంధన ధరల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై హోంమంత్రి మరింత విరుచుకుపడ్డారు. కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లను తగ్గించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పన్నులను తగ్గించలేదని అన్నారు. దేశంలోనే అత్యంత ఎక్కువ ధరకు రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తున్నారని.. అత్యంత ఖరీదైన విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. రాజస్థాన్‌లో దీనికి బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని నిర్మూలించాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం వస్తే పన్నులతో పాటు విద్యుత్ ధరలను తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయదు. రోడ్లు వేయదు, కరెంటు ఇవ్వదు, ఉపాధి కల్పించదు. గెహ్లాట్ ప్రభుత్వం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేయగలదు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కూడా లక్ష్యంగా చేసుకున్న షా, ఈ ఏడాది ప్రారంభంలో ఉదయ్‌పూర్‌లో నరికి చంపిన టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్యను గుర్తు చేసుకున్నారు.”దర్జీ కన్హయ్య లాల్‌ను దారుణంగా చంపేశారు, మీరు సహిస్తారా? కరౌలీ హింసను సహిస్తారా? అల్వార్‌లోని 300 ఏళ్ల పురాతన ఆలయాన్ని కూల్చివేస్తే సహిస్తారా?” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
West Bengal: కోల్‌కతాలో ఈడీ దాడులు.. ఓ వ్యాపారి ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలు
జోధ్‌పూర్, చిత్తూరు, నోహర్, మల్పురా, జైపూర్ అల్లర్లను కాంగ్రెస్ ముందస్తుగా ప్లాన్ చేసిందని అమిత్ షా ఆరోపించారు. రాజస్థాన్‌లో మహిళలపై కేసులు 56 శాతం పెరిగాయన్నారు. జైపూర్‌లో మహిళా టీచర్‌ను సజీవ దహనం చేశారని ఆయన వెల్లడించారు. రాజస్థాన్‌లో 23 మెడికల్ కాలేజీలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను షా కోరారు. ఈరోజు తెల్లవారుజామున, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉన్న టానోట్ ఆలయ సముదాయంలో సరిహద్దు పర్యాటక అభివృద్ధి పనులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. రాజస్థాన్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా హోంమంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన జైసల్మేర్ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!