West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. నోట్ల గుట్టలు బయటపడ్డాయి. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్‌ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. రూ.7కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు.
Dog Attacks: డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్కకాటు.. వీడియో వైరల్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ-నగేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్‌తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు ఆమిర్‌ఖాన్‌తోపాటు మరికొంత మంది పై ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు.గేమింగ్ యాప్ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రమోటర్ ఆమిర్ ఖాన్ నివాసంతో పాటు 6 చోట్ల శనివారం సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యం ఆమిర్‌ఖాన్ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడగా.. అధికారులు లెక్కింపు మొదలు పెట్టారు. ఇప్పటివరకు అది రూ.7కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ యాప్‌కు చైనా నియంత్రణలో నడుస్తున్న రుణ యాప్‌లతో సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.