Britain’s new monarch: బ్రిటన్‌ను ఎక్కువ కాలం ఏలిన రాణి ఎలిజబెత్-2 కన్నుమూయడంతో ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్-3కి సింహాసనం బదిలీ అయింది. ఇకపై ఆయనను కింగ్ చార్లెస్ 3 పేరుతో వ్యవహరిస్తారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ భేటీలో కింగ్ చార్లెస్-3ను బ్రిటన్ కొత్త చక్రవర్తిగా ప్రకటించారు. అతని భార్య కెమిలాస్ పార్కర్ బౌల్స్ ఇప్పుడు ఇంగ్లండ్ రాణిగా వ్యవహరించబడతారు. ఈ భేటీకి క్వీన్ కన్సార్ట్ కెమిల్లా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం, ప్రధానమంత్రి లిజ్ ట్రస్, ఇతరులు హాజరయ్యారు. ఈ యాక్సెషన్ కౌన్సిల్‌లో బ్రిటన్ సీనియర్ ఎంపీలు, సీనియర్ సివిల్ సర్వెంట్లు, కామన్వెల్త్ దేశాల హై కమిషనర్లు, లండన్ మేయర్, కేబినెట్ మంత్రులు, న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. చార్లెస్ 3ను చక్రవర్తిగా ప్రకటించే యాక్సెషన్ కౌన్సిల్ సమావేశానికి దాదాపు 700 మంది ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. కింగ్ చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2కి నివాళులర్పించారు. అనంతరం గొప్ప వారసత్వం, సార్వభౌమాధికారం, విధులు, భారీ బాధ్యతల గురించి మాట్లాడారు.
Mars: అంగారక గ్రహం ఆసక్తికర విషయాలు..సౌరకుటుంబంలో పెద్దది అక్కడే..
చివరగా 1952 సంవత్సరం ఫిబ్రవరి 6న యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై.. కింగ్ జార్జ్ 6 మరణానంతరం ఆమె కూతురు ఎలిజబెత్2ను రాణిగా ప్రకటించింది. అప్పట్లో ఆ సమావేశానికి దాదాపు 200 మంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే 1953 జూన్ 2న ఆమెకు పట్టాభిషేకం జరిగింది. కింగ్ చార్జెస్-3 నవంబర్ 14, 1948 న ఎలిజబెత్, ఫిలిప్‌లకు మొదటి సంతానంగా జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో జూలై 1, 1969న అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయ్యాడు. అతను జూలై 29, 1981న లేడీ డయానా స్పెన్సర్‌ను వివాహం చేసుకున్నాడు. 1660 నుండి ఒక ఆంగ్ల మహిళను వివాహం చేసుకున్న మొదటి రాజ వారసుడు అయ్యాడు. ఆగష్టు 1996లో, డయానా, చార్లెస్ వేర్వేరు మార్గాల్లోకి వెళ్లి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. కారు ప్రమాదంలో డయానా మరణించిన తర్వాత, చార్లెస్ ఏప్రిల్ 2005లో కెమిల్లా పార్కర్ బౌల్స్‌ను తిరిగి వివాహం చేసుకున్నాడు.ఈ జంటకు డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ అనే రాజ బిరుదు లభించింది.
#WATCH | #KingCharlesIII proclaimed Britain's new monarch at the Accession Council at St James's Palace in London, the UK.
Queen Consort Camilla, Prince of Wales William, PM Liz Truss and others in attendance.
(Source: Reuters) pic.twitter.com/hYoBlwIDFB
— ANI (@ANI) September 10, 2022