మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి అనంతరం ఆమె కిరీటంలో ఉన్న వజ్రాలను ఇచ్చేయాలంటూ డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభింమైంది. తాజాగా జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.
పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు సోమవారం 14 రోజులు పొడిగించింది.
మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోమవారం ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. నందిగ్రామ్‌లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎంను విమానం నుంచి దించేశారని ఆరోపించారు.
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామీణ గుయిజౌ ప్రావిన్స్‌లోని సంధూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. నైరుతి చైనాలో ఆదివారం జరిగిన ఈ బస్సు ప్రమాదంలో 27 మంది మరణించారు.
: శనివారం వేగంగా దూసుకెళ్తున్న రైలులో ఓ యువ వైద్యురాలు ఓ మహిళకు పురుడు పోసి అందరి మన్ననలు పొందింది. ఈ సంఘటనను మరవక ముందే తమిళనాడులో మరో మహిళ అర్ధరాత్రి నడిరోడ్డుపై పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ శనివారం తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న ఓ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ తాజాగా వైరల్‌గా మారింది.