మన సంస్కృతిపై అభిమానంతో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునేందుకు భారత్‌కు వస్తుంటారు. తాజాగా ఓ మెక్సికన్ జంట హిందూ సంప్రదాయంపై అభిమానంతో పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చింది.
లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది సాజిద్ మీర్‌ను 'ప్రపంచ తీవ్రవాదిగా' గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం, అమెరికా సహకారంతో ప్రతిపాదించిన ప్రతిపాదనపై చైనా శుక్రవారం మరో సారి అడ్డుపుల్ల వేసింది.
చైనాలో రెండు జెయింట్ క్రిస్టల్‌తో నిండిన డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్తగా కనుగొనబడిన గుడ్లు డైనోసార్ కొత్త జాతికి చెందినవని భావిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రధాని మోదీకి అందించిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన బహుమతుల ఇ-వేలాన్ని ప్రారంభించింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అమిత్ షా కాన్వాయ్‌కి ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది కారు వెనక అద్దం పగలగొట్టారు.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో శనివారం 8 చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడిచిపెట్టారు.ప్రధానమంత్రి మోడీ మొదటి ఎన్‌క్లోజర్ నుంచి రెండు చిరుతలను విడిచిపెట్టారు
ప్రధానమంత్రి 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు మోడీని ప్రశంసిస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు కక్షగట్టి.. ఆమెను కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.
నమీబియా నుంచి 8 చీతాలతో కూడిన ప్రత్యేక కార్గో బోయింగ్ 747 చార్టర్డ్ విమానం శనివారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు.