India vs Pakistan History: ఫిబ్రవరి 15.. అదే తేదీ, అదే చరిత్ర! మళ్లీ టీమిండియాకు టైటిల్‌పై భయం?
- పాకిస్థాన్ పై 61 పరుగుల భారీ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan History: టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టింది. నిజానికి ఈ మ్యాచ్ ఫలితంపై ఎవరికీ అనుమానంలేదు. కానీ, పాకిస్థాన్ మరీ ఇంత ఘోరంగా ఓడిపోవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీమిండియా జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా 61 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే విజయం మాత్రం అందుకున్నాం కానీ ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరీ అదేంటో చూసేద్దామా..
Ind vs Pak: పాకిస్తాన్‌పై గెలుపు.. న్యూ వరల్డ్ రికార్డు సృష్టించిన భారత్
Also Read
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న జరిగింది. ఇదివరకు ఇదే తేదీన 2015 వన్డే వరల్డ్ కప్‌లో కూడా భారత జట్టు పాకిస్థాన్ ను ఓడించింది. అప్పట్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈసారి మ్యాచ్ జరిగిన రోజు మహాశివరాత్రి పర్వదినం. దేశవ్యాప్తంగా శివభక్తులు పండుగ జరుపుకుంటుండగా టీమిండియా అద్భుత విజయాన్ని బహుమతిగా ఇచ్చింది. ఇదే తరహాలో 2003 వన్డే వరల్డ్ కప్‌లో కూడా మహాశివరాత్రి రోజునే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా భారత్ విజయం సాధించింది.
అయితే ఈ రెండు టోర్నీలలో.. 2003 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ వరకు వెళ్లి చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు 2015 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ పరాజయం చెందింది. ఆ రెండు టోర్నమెంట్ లలో ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే ఫిబ్రవరి 15, మహాశివరాత్రి రోజునే భారత్ పాకిస్థాన్‌పై మళ్లీ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద తేడాతో పాక్‌ను ఓడించింది. దీంతో ఇప్పుడు అభిమానుల్లో ఒక ప్రశ్న తలెత్తుతోంది.. మళ్లీ అదే చరిత్ర పునరావృతమవుతుందా? అని.
Ind vs Pak : భారత్‌కు శివరాత్రి.. పాకిస్తాన్‌కు కాళరాత్రి.. పాక్‌పై భారత్ విజయ దుందుభి
అయితే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటివరకు మంచి ప్రదర్శన చూపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ జట్టు బ్యాలెన్సుడ్ గా కనిపిస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న జట్టు, ఈసారి చరిత్రను చెరిపేసి టైటిల్‌ను కైవసం చేసుకుంటుందా అన్నది చుడాలిమరి. చరిత్రలోని ఇలాంటి ఘటనలు కేవలం గణాంకాలేనా? లేక నిజంగానే టీమిండియాకు మరోసారి అడ్డంకిగా మారుతాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!