IND vs PAK-Shivratri: శివరాత్రి జ్ఞాపకాలు.. సచిన్ మాస్టర్ క్లాసిక్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్!
- శివరాత్రి రోజు భారత్–పాకిస్థాన్ మ్యాచ్
- వన్డే వరల్డ్‌కప్‌లో సచిన్ 98 పరుగులు
- టీ20 వరల్డ్‌కప్‌లో కిషన్ 77 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Shivratri Matches: శివరాత్రి రోజు భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చేది 2003 వన్డే ప్రపంచకప్. ఆ వరల్డ్‌కప్‌లో ఇండో-పాక్ మ్యాచ్ మార్చి 1న శివరాత్రి రోజే జరిగింది. అప్పట్లో భారత్ ముందు పాకిస్థాన్ 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ రోజుల్లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం పెద్ద సవాలే. అయితే క్రికెట్ దేవుడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు.
సచిన్ టెండూల్కర్ కేవలం 75 బంతుల్లో 98 పరుగులు చేసి పాక్ బౌలింగ్ దళాన్ని పూర్తిగా కుదేలు చేశాడు. ముఖ్యంగా షోయబ్ అక్తర్, వకార్ యూనస్ లాంటి దిగ్గజ పేసర్ల బౌలింగ్‌లో ఆడిన అప్పర్‌కట్ షాట్లు ఇప్పటికీ అభిమానుల కళ్లముందు తిరుగుతూనే ఉంటాయి. ఆ ఇన్నింగ్స్ మాత్రమే కాదు.. ఆ మ్యాచ్ మొత్తం క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. అయితే తృటిలో సచిన్ సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేసుంటే.. ఆ మ్యాచ్ మరింత ప్రత్యేకంగా నిలిచేది.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఇదే సందర్భం మళ్లీ పునరావృతమైంది. శివరాత్రి రోజునే (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ 2026లో భారత్–పాక్ తలపడ్డాయి. సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్‌తో పోల్చలేనప్పటికీ.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 రన్స్ చేశాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆపై బౌలర్లు చెలరేగడంతో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కిషన్ దూకుడు ఇన్నింగ్స్ భారత విజయానికి కీలకంగా మారింది. ఈ రెండు మ్యాచ్‌లు శివరాత్రి రోజునే జరిగి.. భారత అభిమానులకు ప్రత్యేకమైన జ్ఞాపకాలను అందించాయి. ఒకటి సచిన్ మహత్తర క్లాసిక్ అయితే, మరొకటి ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!