Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు తుదివీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు ముగిశాయి. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు, రాజులు, రాణులు పాల్గొన్నారు. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలికారు.
సోమవారం ఉదయం 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో రాణి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైనట్లైంది. వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబే వరకూ రాణి శవపేటికను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి 12.15 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వెల్లింగ్టన్ అర్చి వరకు సాగింది. అక్కడి నుంచి విండ్సర్స్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి శవపేటికను తీసుకెళ్లారు. ఈ అంతిమయాత్రలో కింగ్ ఛార్లెస్-3తోపాటు రాజ కుటుంబం పాల్గొంది. కింగ్ జార్జ్-6 మెమోరియల్ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్‌లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Kashmir: 30 ఏళ్ళ తరువాత కశ్మీర్ థియేటర్లో వేసిన మొట్ట మొదటి సినిమా ఏదంటే..?
బ్రిటన్ రాణి అంతిమ సంస్కారాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది. అంతిమయాత్రను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా పౌరులు బ్రిటన్‌లోని లండన్ వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిని నియంత్రించేందుకు లండన్‌లో 36 కిలోమీటర్ల మేర బారికేడ్లు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ప్రాంతాల్లో రాణి అంత్యక్రియలను లైవ్ టెలికాస్ట్ చేశారు. బ్రిటన్‌లోని పార్కులలో భారీ తెరలు ఏర్పాటు చేసి అంత్యక్రియలను ప్రదర్శించారు. 1965లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అంత్యక్రియల తర్వాత భారీ స్థాయిలో జరిగిన కార్యక్రమం ఇదేనని సమాచారం. తండ్రి మరణానంతరం పాతికేళ్ల వయసులో బ్రిటన్ పగ్గాలు చేపట్టిన క్వీన్ ఎలిజబెత్-2.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించారు. అత్యంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పరిపాలించిన సామ్రాజ్ఞిగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 8న తన 96వ ఏట తుది శ్వాస విడిచారు.
https://www.youtube.com/watch?v=gT0J0_YUK64
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!