పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. విజయమే లక్ష్యం కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
ప్రధానిపై మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ బెంగాల్ అసెంబ్లీలో మోడీకి మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.
మరణశిక్ష విధించే కేసులను పరిష్కరించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన శిక్ష తగ్గించే పరిస్థితులపై మార్గదర్శకాల రూపకల్పనకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సూచించింది.
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మెజారిటీ పరీక్ష కోసం రాష్ట్ర అసెంబ్లీని సెప్టెంబర్ 22న ప్రత్యేక సమావేశానికి పిలిచినట్లు ప్రకటించారు.
అయోధ్య అనగానే అందరికి గుర్తొచ్చేది రాముడు పుట్టిన స్థలం అని.. అదే అయోధ్యలో ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడికట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సంచలనం రేపుతోంది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరెన్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు.