రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ఆదిలాబాద్ జిల్లాలోని గిమ్మ గ్రామంలో ఆయన వ్యాఖ్యానించారు.
మల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై తీసిన 'విక్రమ్' సినిమా తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాలలోనూ చక్కటి విజయాన్ని సాధించింది.
వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని బోర్డు భావిస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం అన్ని రాష్ట్ర సంఘాలకు తెలిపారు. 2022-23 కోసం స్వదేశీ అంతర్జాతీయ, దేశీయ సీజన్‌పై ముఖ్యమైన అంశాలను వివరిస్తూ గంగూలీ అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.
విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్' షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ భారీ పిరియాడికల్ మూవీ 1930-40 నేపథ్యంలో అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ టికెట్ల విక్రయంపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ వివరణ ఇచ్చారు.
మొన్న మహేశ్ బాబు 'పోకిరి'... నిన్న పవన్ 'జల్సా'... ఇప్పుడు బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'. టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. దానికి తగ్గట్లే ఆయా సినిమాలకు అపూర్వమైన ఆదరణ లభించింది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హెచ్‌సీఏ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.