Queen Elizabeth-2: బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి అనంతరం ఆమె కిరీటంలో ఉన్న వజ్రాలను ఇచ్చేయాలంటూ డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభింమైంది. తాజాగా జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది. బ్రిటన్ రాణి కిరీటంలో అనేక వజ్రాలు పొదగబడి ఉంటాయి. అవన్ని బ్రిటీష్ పాలిత దేశాల నుంచి దురాక్రమణంగా తెచ్చిన వజ్రాలే. ఐతే ప్రస్తుతం రాణీ మరణించింది కాబట్టి ‘మా వ్రజాలు మాకిచ్చేయండి’ అంటూ పలు దేశాలు డిమాండ్ చేయడం మొదలు పెట్టాయి. గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికాగా పిలువబడే కలినన్ డైమండ్‌ను ఇచ్చేయాలని దక్షిణాఫ్రికా డిమాండ్ చేస్తోంది. ఆ డైమండ్ దాదాపు 500 క్యారెట్లు ఉంటుంది. 1905లో దక్షిణాఫ్రికాలో మైనింగ్‌లో దొరికిన ఓ పెద్ద వజ్రం నుంచి కలినన్ డైమండ్‌ను తీశారు. రాణి వద్ద ఉండే దండంలో కలినన్ వజ్రం ఉన్నట్లు తెలుస్తోంది.
Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు తుదివీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
ఈ వజ్రాన్ని వలస పాలకులు బ్రిటీష్ రాజకుటుంబానికి అప్పగించారు. ఆ వజ్రం ప్రస్తుతం రాణి రాజదండంపై అమర్చబడి ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్ లబ్ధి చేకూర్చుకుందంటూ ఎత్తిపొడుస్తూ…తమ దేశ వజ్రాన్ని ఇచ్చేయమంటూ డిమాండ్ చేసింది. తక్షణమే ఆ వజ్రాన్ని ఇవ్వాలంటూ దక్షిణాఫ్రికా కార్యకర్త తండుక్సోలో సబేలో డిమాండ్ చేశారు. డైమండ్ ఇవ్వాలంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్ ద్వారా సంతకాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 6వేల మంది సంతకం చేశారు. అంతేకాదు వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్‌లైన్‌లో Change.org అనే వెబ్‌సైట్‌లో పిటిషన్ కూడా వేసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా బ్రిటన్ చేసిన నిర్వాకానికి పరిహారం ఇవ్వాల్సిందేనని, పైగా దొంగలించిన మొత్తం సొత్తును కూడా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.