ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను జారవిడిచాడు. అందులో రౌడీహీరో తీవ్రమైన శిక్షణా సెషన్‌లను చూడవచ్చు. ఈ వీడియోలో విజయ్ తన స్టంట్స్ చేసే విధానాన్ని పరిపూర్ణంగా చూపించాడు.
లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర భారతదేశం, పార్లమెంట్‌ల మనస్తత్వం ఇంకా అనుకూలంగా లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు.
న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలిజీయం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రక్రియపై ఆందోళనలు ఉన్నందున ఈ విషయంపై చర్చ జరగాల్సి ఉందన్నారు.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదని ఆయన ఓ వ్యాపారి అని లలన్ సింగ్ విమర్శించారు. పార్టీలో చేరాలని నితీష్ కుమార్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో లలన్ సింగ్ ఈ విధంగా నొక్కి చెప్పారు.
పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ బాలిక తన హాస్టల్ మేట్స్ ప్రైవేట్ వీడియోలను ఓ అబ్బాయి సాయంతో ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో పంజాబ్‌లోని మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో భారీ నిరసనలు చెలరేగాయి.
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న టీమిండియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి మొహాలీలో ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ సిరీస్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు.
నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయంత్రం లండన్ చేరుకున్నారు.
న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుండగా ఓ వ్యక్తి కోర్టులోనే కేకలు వేశాడు. తాను చేసిన తప్పుకు తనకు ఒకటి కాదు ఐదు యావజ్జీవ శిక్షలు విధించాలంటూ ఓ హత్యకేసు దోషి న్యాయమూర్తిని ప్రాధేయపడ్డాడు.