తమిళనాడులోని చెన్నైలో పుజాల్ ప్రాంతంలో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించిన విద్యార్థి.. గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
గత కొన్నేళ్లుగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ అత్యున్నత న్యాయవాది అయిన భారత అటార్నీ జనరల్‌గా తిరిగి రావాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం చెప్పారు.
కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న గులాంనబీ ఆజాద్ ఇవాళ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆజాద్ తన కొత్త రాజకీయ పార్టీ గురించి అడిగినప్పుడు, "నేను సోమవారం విలేకరుల సమావేశం నిర్వహిస్తాను" అని చెప్పారు.
రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలోని బంజర్ లోయలోని ఘియాగి ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి వాగులో పడింది.
9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్‌లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని వినియోగించియాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు.
ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. తుది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు అంకిత తండ్రి, సోదరుడు ఆమె అంత్యక్రియలు చేయడానికి మొదట నిరాకరించారు. అనంతరం మనస్సు మార్చుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దేశరాజధానిలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.