Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలోని బంజర్ లోయలోని ఘియాగి ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి వాగులో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Apple CEO: 9 ఏళ్లకే ఐఓఎస్ యాప్‌ను డిజైన్ చేసిన భారతీయ బాలిక.. ప్రశంసించిన యాపిల్ సీఈవో
ప్రాథమిక నివేదిక ప్రకారం వాహనంలో డ్రైవర్‌తో సహా 17 మంది ప్రయాణిస్తున్నట్లు కులు జిల్లా డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు.. జిల్లా యంత్రాంగం కలిసి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. బాధితులంతా హరియాణా, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.