Ankita Bhandari: రిసెప్షనిస్ట్ అంకిత అంత్యక్రియలు పూర్తి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు సీఎం హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ankita Bhandari: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. తుది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు అంకిత తండ్రి, సోదరుడు ఆమె అంత్యక్రియలు చేయడానికి మొదట నిరాకరించారు. అనంతరం మనస్సు మార్చుకుని అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి అంగీకరించారని ముఖ్యమంత్రి పుష్కర్‌సింద్ ధామీ తెలియజేశారు. సత్వర న్యాయం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తుందని సీఎం పుష్కర్ ధామి తెలిపారు. తుది పోస్టుమార్టం నివేదికను త్వరలో బహిరంగంగా వెల్లడిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి హామీతో అంకిత అంత్యక్రియలను ఆమె తల్లిదండ్రులు నిర్వహించారు.
మరోవైపు, 19 ఏళ్ల యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్‌లో నిరసనలు కొనసాగాయి. యువతి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి, ఆదివారం ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో నిరసనకారులు రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిని చాలా గంటలపాటు దిగ్బంధించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
Delhi: అబ్బాయిలకు కూడా భద్రత లేదు.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం
ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్యకేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఈ కేసుకు సంబంధించి వాట్సప్ చాట్‌లపై కూడా దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..