శుక్రవారం భారీ వర్షం, గాలులతో ఫియోనా తుఫాను అట్లాంటిక్ ద్వీపమైన బెర్ముడాను ముంచెత్తింది. ఇది తూర్పు కెనడా వైపు పయనించింది. ఇది కెనడియన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుఫానులలో ఒకటిగా మారే ప్రమాదం ఉంది
బిహార్‌లో బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు, న్యాయపరమైన సమస్యలతో చాలా కాలం పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తేలిగ్గా తీసిపారేశారు.
ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అంకితా భండారీ స్నేహితులను పోలీసులు విచారించగా వారు సంచలన విషయాలను బయటపెట్టారు.
మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది.
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. రాష్టంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ఆ సమయంలో ఝాన్సీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పొగాకు నములుతూ.. మహోబా ఎమ్మెల్యే వీడియో గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు.
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్‌లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై పెట్రోల్ బాంబుల దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై సమీపంలోని తాంబరం సమీపంలోని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంటిపై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు విసిరినట్లు పోలీసులు తెలిపారు.