PFI: గత కొన్నేళ్లుగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్‌లోనూ వేల సంఖ్యలో పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. వచ్చిన నిధులను భారత్‌లో ఉన్న పీఎఫ్‌ఐ కార్యకర్తలకు హవాలా ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయని.. ఇలా వచ్చిన 120 కోట్ల నిధులకు సంబంధించి ఈడీ కూపీ లాగుతోంది.
Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా కేంద్రం ఆఫర్.. నో చెప్పిన ముకుల్ రోహత్గీ
ప్రపంచ వ్యాప్తంగా తేజస్ అనే పేపర్‌ను పీఎఫ్‌ఐ నడిపిస్తున్నట్లు తెలిసింది. ఆ నిధులను తేజస్‌కు ఒచ్చిన డొనేషన్ అంటూ ఫేక్ రిసీప్ట్‌లను చూపిన వైనం వెలుగులోకి వచ్చింది. అబూదాబీలో ఉన్న దర్బార్ హోటల్ కేంద్రంగా హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తెలిసింది. దీనికి సంబంధించి అబ్దుల్ రజాక్‌ను ఈడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. తేజస్‌కు డైరెక్టర్‌గా పని చేసిన కేరళ పీఎఫ్ఐ నాయకుడు షఫిక్‌ను ఈడీ మూడు రోజుల క్రితమే అరెస్ట్ చేసింది. షఫిక్ ఖతార్ నుంచి నిధులను సమకూర్చుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ , నిజామాబాద్‌లో అరెస్ట్ అయిన కార్యకర్తల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన కస్టడీకి తీసుకోనుంది.