Covid Cases in India: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. 4,688 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో డైలీ పాజిటివిటీ రేటు 2.51 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ఇండియాలో 43,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా ఇండియాలో ఇప్పటి వరకు4,45,72,243 కరోనా కేసులు నమోదు అవ్వగా.. 4,40,00,298 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 5,28,530 మరణించారు. దేశంలో అర్హులైన వారికి 2,17,68,35,714 డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. నిన్న ఒక్కరోజే 11,67,772మందికి కొవిడ్ టీకాలు ఇచ్చారు. 1,64,377 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
Chennai: ఆత్మహత్య చేసుకోవడం ఎలా?.. నటించి చూపించబోయాడు.. కానీ..
ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 2,49,111 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 460 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 62,02,42,551కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,40,339 మంది మరణించారు. మరో 3,64,837 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 600,289,648కు చేరింది. రష్యాలో కొత్తగా 46,758 కేసులు నమోదయ్యాయి. మరో 95 మంది మరణించారు.జపాన్‌లో కొత్తగా 40,918 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 69 మంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్‌లో 38,980 కొవిడ్ కేసులు నమోదు కాగా, వైరస్ వల్ల 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 31,365కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా 25,792 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 73 మంది మృతి చెందారు.