Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా కేంద్రం ఆఫర్.. నో చెప్పిన ముకుల్ రోహత్గీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukul Rohatgi: ప్రభుత్వ అత్యున్నత న్యాయవాది అయిన భారత అటార్నీ జనరల్‌గా తిరిగి రావాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం చెప్పారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్(91) పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ పదవికి రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం తెలిసిందే. వేణు గోపాల్ కూడా ఆరోగ్యో కారణాలతో ఈ పదవిలో మరింతకాలం కొనసాగనని ఇప్పటికే చెప్పారు. అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ మొదటి పదవీకాలం 2020లో ముగియగా, తన వయస్సు దృష్ట్యా తన బాధ్యతల నుండి తనను తప్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరో పర్యాయం కొనసాగాలని ప్రభుత్వం కోరింది. రెండు సంవత్సరాల పాటు రెండో సారి కూడా కొనసాగారు. ఇక వయస్సు సహకరించకపోవడం వల్ల తనను తప్పించాలని కోరగా.. ముకుల్ రోహత్గీ బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం ప్రతిపాదించింది.
Ghulam Nabi Azad: నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!
Also Read
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
కానీ ముకుల్ రోహత్గీ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 67 ఏళ్ల ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒకవేళ కేంద్రం ఆఫర్‌కు ఆయన ఓకే చెప్పి ఉంటే ఈ పదవిని రెండోసారి చేపట్టేవారు. ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ గుజరాత్ ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ అల్లర్ల కేసుతో సహా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టులలో అనేక ఉన్నత స్థాయి కేసులలో హాజరయ్యారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్‌కు సంబంధించిన కేసును కూడా ఆయన వాదించారు. ఇటీవల, డ్రగ్స్-క్రూయిజ్ కేసులో అరెస్టయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ రక్షణ బృందానికి రోహత్గీ నాయకత్వం వహించాడు.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు