కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌లు కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో నేతలు ఆమెను కలిశారు. జాతీయ రాజకీయాలు, విపక్ష పార్టీల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు పుల్కిత్ ఆర్య బాధితురాలి స్నేహితుడిని కూాడా తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించాడు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. శనివారం అర్థరాత్రి వేళ ఆయన అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది.
ఉత్తర సరిహద్దుల్లో చైనీయులతో భారత్ పోరాడుతుండగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచారనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.