ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.
దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. అమెరికన్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నెయిఫియు రియో ఐదోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. తాజా ఎన్నికల్లో అధికారానికి అవసరమైన పూర్తి మెజార్టీ సాధించిన ఎన్‌డీపీపీ కూటమి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఐదోసారి సీఎంగా నెయిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అభిమానులు, స్టార్స్ సందడి మధ్య టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ ముగిసింది. తన చివరి మ్యాచ్‌లో సానియా మీర్జా విజయం సాధించింది. సింగిల్స్‌లో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడారు.
రాష్ట్రంలో సంచలనం రేపిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.