Revanth Reddy: కళికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన రేవంత్.. నిలిచిపోయిన పనులపై ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు పనులు అడుగు ముందుకు పడలేదన్న రైతులు రేవంత్ వద్ద వాపోయారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి పేజ్ 2 స్టేజ్ 1ను 2005లో 1750 కోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారని.. ఇంతమంచి ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్‌ను ఆనాడు చెన్నమనేని రాజేశ్వరరావు అభినందించారని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. 2018లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందని హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని చెప్పారు. సాగు, తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు,రాస్తారోకోలు చేసిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
రైతులు ప్రశ్నిస్తే వరదకాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారని.. ఎతైన ఈ ప్రాంతానికి వరదకాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అపర భగీరథుడు, ఇంజనీర్ కేసీఆర్‌కు ఆ మాత్రం తెలియదా? అంటూ ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారని.. ఉమ్మడిపాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే.. తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారని రేవంత్ విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్‌కు పెద్ద తేడా ఏం లేదన్నారు. ఈ వివక్షను ఈ ప్రాంత రైతులకు భరించే ఓపిక లేదన్నారు.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
Read Also: Bandi Sanjay: మీ పాలనలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ
కేసీఆర్‌ను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని రేవంత్ చెప్పారు. ఆనాడు మేం మొదలు పెట్టిన ప్రాజెక్టును రేపు మేమే పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ ప్రాంత రైతులకు హామీ ఇస్తున్నానంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత సమస్యలపై ఇక్కడి ఎమ్మెల్యేకు అవగాహన లేదని.. విహార యాత్రలకు వచ్చినట్లుగా ఎమ్మెల్యే జర్మనీ నుంచి వచ్చి పోతున్నారని రేవంత్ మండిపడ్డారు. కోర్టులను అడ్డుపెట్టుకుని సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్నారు. కానీ మానసికంగా ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదన్నారు. వారసత్వం ముసుగులో రాజకీయాల్లో కొనసాగుతున్నారని.. రాజేశ్వర్ రావు పేరును చెడగొడుతున్నారని రేవంత్ విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!