శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిపై ఆరోపణలను ధ్రువపరిచే ఆధారాలను ఢిల్లీ పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ వాదనలో పోలీసులు కీలక విషయాలను తెలిపారు.
కేరళలోని ఓ బీచ్‌లో అవుట్‌డోర్ అడ్వెంచర్ చేయడానికి ప్లాన్ చేసిన ఇద్దరు పర్యాటకులు తమ పారాచూట్ అనుకున్న చోట దిగకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతంలోని వర్కాలలోని పాపనాశం బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్న ఓ వ్యక్తి, ఓ మహిళకు సంబంధించిన పారాచూట్ విద్యుత్ స్తంభానికి చిక్కుకోవడంతో వారు గట్టిగా కిందపడకుండా స్తంభాన్ని పట్టుకున్నారు.
ఒడిశాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని నరికి చంపి, ఆపై సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు.
బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గల గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో జరిగిన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అయినా ఆ యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఓ "అదృశ్య హస్తం" నడిపిస్తోందని చైనా ఆరోపించింది.
టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
సైన్యంలో మహిళలు రాణించడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు అది చిన్నవిషయంగా మారిపోతోంది. ఎందుకంటే మహిళలు ఇప్పుడు త్రివిధ దళాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై రాజకీయ కారణాలతో ఆప్ నేతను టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని తొలగించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.