Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. అమెరికన్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. మిండానావో ద్వీపంలోని దావో డి ఓరో ప్రావిన్స్‌లో భూకంప కేంద్రం ఉంది. భూ ప్రకంపనలు 38.6 కిలోమీటర్ల లోతులో సంభవించాయని అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే.. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు రాలేదు. ఈ భూకంపం సుమారు 30 సెకన్ల పాటు కొనసాగింది. 30 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించినట్లు కార్పోరల్ స్టెఫానీ క్లెమెన్ పోలీసులతో వెల్లడించారు. మారగుసన్‌కు ఆనుకుని ఉన్న న్యూ బటాన్ మునిసిపాలిటీలోని విపత్తు కార్యాలయంలో ఫోబ్ అల్బెర్టో, ఆమె సహచరులు తమ భవనం కంపించడంతో అక్కడి నుంచి పరుగులు తీసినట్లు వెల్లడించారు.
ఉత్తర ఫిలిప్పీన్స్‌లో అక్టోబర్‌లో చివరిసారిగా భారీ భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం అబ్రా ప్రావిన్స్‌లో సంభవించింది. అనేక మంది గాయపడగా.. భవనాలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.గత జులైలో పర్వత ప్రాంతం అబ్రాలో 7.0-తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడగా.. నేలకు పగుళ్లు ఏర్పడ్డాయి. 11 మంది మరణించగా.. అనేక వందల మంది గాయపడ్డారు. ఇంతకుముందు ఫిబ్రవరి 16న ఫిలిప్పీన్స్‌లోని మాస్బేట్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, దీని కారణంగా ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయబడలేదు. దీని వల్ల ఎటువంటి నష్టం జరిగినట్లు నిర్ధారించబడలేదు.
Read Also: Pakistan: పీఓకేలో మహిళా టీచర్లు, బాలికలకు హిజాబ్ తప్పనిసరి..
టర్కీ, సిరియాలో వినాశకరమైన భూకంపం కారణంగా 50 వేల మంది మరణించారు. ఈ భూకంపం ఘటన ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేసింది. ఫిలిప్పీన్స్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని, దీనిపై భూగర్భ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఫిలిప్పీన్స్‌లో వరదల కారణంగా చాలా మంది చనిపోయారు.