మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ భారత్ మ్యాట్రిమోనీ హోలీ సందర్భంగా విడుదల చేసిన తన తాజా వీడియో ప్రకటన ట్రోల్ చేయబడుతోంది. ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ విడుదల చేసిన ప్రకటన హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
తమిళనాడులో బీజేపీకి షాక్ తగిలింది. చెన్నై వెస్ట్ బీజేపీ ఐటీ వింగ్‌కు చెందిన 13 మంది నేతలు పార్టీకీ రాజీనామా చేశారు.వారం క్రితం తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు నిర్మల్ కుమార్, దిలీప్ కన్నన్ పార్టీకి రాజీనామా చేసి ఏఐఏడీఎంకేలో చేరిన అనంతరం డజన్ల కొద్దీ కాషాయ పార్టీ కార్యకర్తలు దీనిని అనుసరించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చౌపాల్ తహసీల్ నెర్వా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స కోసం బుమ్రాను బీసీసీఐ న్యూజిలాండ్‌కు పంపిచింది.
పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలోని నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
దక్షిణ కొరియాలో ఓ ఇంట్లో 1000 కుక్కలు చనిపోవడం కలకలం రేపింది. 60 ఏళ్ల ఓ వ్యక్తి 1000 కుక్కలను ఇంట్లోనే బంధించి ఆకలితో అలమటించేలా చేసిన అవి చనిపోయేంతవరకు అలాగే ఉంచాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది అరుణ్ సుబ్రమణియన్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా అరుణ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.
ఇండియన్ నేవీకి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇండియన్ నేవీ హెలికాప్టర్ ఈరోజు ముంబై తీరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) రొటీన్ ఫ్లయింగ్ మిషన్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.