Sania Mirza Farewell Match: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అభిమానులు, స్టార్స్ సందడి మధ్య టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ ముగిసింది. తన చివరి మ్యాచ్‌లో సానియా మీర్జా విజయం సాధించింది. సింగిల్స్‌లో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడారు. ఆట అనంతరం సానియా మీర్జా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ చేసిందో.. అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడింది. సానియా మీర్జా కంటతడి పెట్టడంతో అభిమానులు బాధపడ్డారు. సానియా చివరి మ్యాచ్‌ను చూసేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, హీరో దుల్కర్ సల్మాన్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ మ్యాచ్‌ను తిలకించారు. సానియా మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి రావడంతో ఎల్.బి స్టేడియం సందడిగా మారింది. మ్యాచ్ తర్వాత సానియా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది.
Read Also: Sania Mirza: సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్.. చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్టార్స్
సానియా తన 20 ఏళ్ల కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచుకుంది. డబుల్స్‌లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో సానియా నిలిచింది. సానియా మీర్జా ఏసియన్ గేమ్స్‌లో 8, కామన్వెల్త్ గేమ్స్‌లో 2 మెడల్స్ సాధించింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నతోపాటు.. అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను సానియా అందుకుంది. ప్రస్తుతం విమెన్స్ ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు మెంటర్‌గా సానియా ఉన్నారు. సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్.. గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏఆర్ రెహమాన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారు.