Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Top Headlines 1pm On March 5th

Top Headlines @1PM: టాప్ న్యూస్

Published Date :March 5, 2023 , 1:02 pm
By Mahesh Jakki
Top Headlines @1PM: టాప్ న్యూస్
  • Follow Us :

సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరుగుతోంది. సానియా రెండు మ్యాచ్‌లను ఆడనుంది. సింగిల్స్‌లో సానియా vs రోహన్ బోపన్న ఆడనుండగా.. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడనున్నారు. సానియా చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్పోర్ట్స్ స్టార్స్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. సానియా తన 20 ఏళ్ల కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచుకుంది. డబుల్స్‌లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో సానియా నిలిచింది. సానియా మీర్జా ఏసియన్ గేమ్స్‌లో 8, కామన్వెల్త్ గేమ్స్‌లో 2 మెడల్స్ సాధించింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నతోపాటు.. అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను సానియా అందుకుంది. ప్రస్తుతం విమెన్స్ ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు మెంటర్‌గా సానియా ఉన్నారు. సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్.. గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏఆర్ రెహమాన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, రాష్ట్రమంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌ గౌడ్, క్రికెటర్ యువరాజ్‌ సింగ్, హీరో దుల్కర్ సల్మాన్‌ పలువురు ప్రముఖులు వీక్షిస్తున్నారు. మ్యాచ్‌ జరుగుతుండగా యువరాజ్‌ కోసం ఓ అభిమాని పరుగులు తీయగా.. యువీ అతని క్యాప్‌ మీద సంతకం ఇచ్చి ఆనందపరిచాడు.

మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్యా?
రాష్ట్రంలో సంచలనం రేపిన వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని పోలీసులు చెబుతుండగా.. సైఫ్‌ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడని తండ్రి చెబుతున్నారు. తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్య కోణంలో దర్యాప్తు చేస్తోన్నారు. ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటన కేసులో నిందితుడు సైఫ్ నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు సైఫ్ దగ్గర నుంచి పోలీసులు వివరాలు సేకరించి అతడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి మళ్లీ జైలుకు పంపించమన్నారు. నాలుగు రోజులుగా సైఫ్ నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు కీలక అంశాలను నోట్ చేసుకున్నారు. ప్రీతి అస్వస్థతకు గురైన రోజు డ్యూటీలో ఉన్న హెడ్‌నర్స్, స్టాఫ్ నర్స్, మరో జూనియర్ డాక్టర్ స్టేట్‌మెంట్లు ప్రీతి కేసులో కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్‌తో పాటు టాక్సికాలజీ రిపోర్టును పరిశీలించిన పోలీసులు సైఫ్ స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రీతి కేసులో ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రీతిని ఎవరో హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నట్లుగా పోలీసులకు ఎక్కడ ఆధారం లభించలేదు. దీంతో హత్యకాదు అనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రీతిది ఆత్మహత్యా? లేక అనారోగ్య సమస్యతో చనిపోయిందా అనే అంశంపై పోలీసులు ఇంకా నిర్ధారించడం లేదు.

దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా?:రేవంత్ రెడ్డి
ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని.. దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? అంటూ రేవంత్‌ ప్రశ్నించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందన్నారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.

శ్రీచైతన్యకు షాక్
హైదరాబాద్‌ శివారు నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్‌పై వేధింపులు నిజమేనని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. శ్రీచైతన్య కాలేజీపై విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. గత నెల 28వ తేదీన నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ ఐదు రోజుల పాటు విచారణ నిర్వహించింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. శ్రీచైతన్య కళాశాలలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. వేరే కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ ఉన్న విషయాన్ని కమిటీ గుర్తించింది. వేరే కాలేజీలో ఆడ్మిషన్ ఉన్నా కూడా నార్సింగి కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. ర్యాగింగ్‌ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందని కమిటీ అభిప్రాయపడింది. శ్రీ చైతన్య కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్న విషయాన్ని కమిటీ పేర్కొంది. కానీ విద్యార్ధులకు సర్టిఫికెట్లను చిన్న కాలేజీల పేరుతో జారీ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. విద్యార్ధుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

 

ప్రధాని మోదీకి 9 మంది ప్రతిపక్ష నేతల లేఖ.. కారణం ఇదే..
కేంద్ర సంస్థల దుర్వినయోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.లేఖలో సంతకాలు చేసిన నేతల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత చంద్రశేఖర్ రావు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 2014 నుంచి బీజేపీ హయాంతో కేసులు నమోదు చేసినవారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. బీజేపీలో చేరిన ప్రతిపక్షాల నేతలపై కేసుల దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని పలు ఉదాహరణలను పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై 2014, 2015లో శారద చిట్ ఫండ్ స్కామ్ లో సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయని, అయితే బీజేపీలో చేరిన తర్వాత కేసులో పురోగతి లేదని, ఇదే విధంగా నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్ లపై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని.. అయితే ప్రస్తుతం ఈ కేసుల్లో కదలిక లేదని లేఖలో పేర్కొన్నారు.

 

అయోధ్య మసీదు నిర్మాణానికి తుది అనుమతి..
అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. మసీదు నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ(ఏడీఏ) తుది క్లియరెన్స్ ఇచ్చింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు అయోధ్యలో ధన్నీపూర్ మసీదు నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ క్లియరెన్స్ ల కారణంగా గత రెండేళ్లుగా నిర్మాణం ఆలస్యం అయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల స్థలంలో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) ట్రస్ట్ ద్వారా మసీదు, ఆసుపత్రి, పరిశోధనా సంస్థ, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీని నిర్మించనున్నారు. శుక్రవారం జరిగి ఏడీఏ బోర్డు మీటింగ్ లో అయోధ్య మసీదు ప్రాజెక్టను ఆమోదించారు. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ కొన్ని శాఖల ఫార్మాలిటీస్ అందచేస్తామని, అవి రెండు రోజుల్లో పూర్తవుతాయని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ వెల్లడించారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ట్రస్టు సమావేశం నిర్వహించి మసీదు నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఖరారు చేస్తామని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. ఏప్రిల్ 21న ముగిసే రంజాన్ తర్వాత ట్రస్టు సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో మసీదు నిర్మాణ పనులు ప్రారంభించే తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

చెన్నై, కోల్‌కతాలకు పొంచిఉన్న ముప్పు.. పెరుగుతున్న సముద్ర మట్టాలు..
పెరుగుతున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలోని కోస్టల్ సిటీలు చెన్నై, కోల్‌కతా ముప్పును ఎదుర్కొంటాయని అంచానా వేసింది. సముద్రమట్టాలు 20-30 శాతం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. దీనిల్ల 2100 నాటికి ఈ రెండు నగరాలతో పాటు ఆసియాలోని మెగాసిటీలు అయిన యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా నగరాలు కూడా ముప్పును ఎదుర్కోనున్నాయి. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల వల్ల నీరు విస్తరిస్తుంది, మంచుపలకలు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి. సముద్ర ప్రవాహాల్లోని మార్పుల కారణంగా అమెరికాలోని ఈశాన్యభాగం, మరికొన్ని తీర ప్రాంతాల్లోకి ఎక్కువ నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. పిలిఫ్పీన్స్ రాజధాని మనీలా కేవలం వాతావరణ మార్పుల కారణంగా 2006 కన్నా 2100లో తీర్ ప్రాంతా వరదలు 18 రెట్లు ఎక్కువగా సంభవిస్తాయని అధ్యయంన తెలిపింది. పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే.. ఇది 96 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతర్గత వాతావరణ వైవిధ్యం అమెరికా, ఆస్ట్రేలియా పశ్చిమ తీరాల వెంబడి సముద్ర మట్టం పెరుగుదలను కూడా పెంచుతుందని స్టడీ పేర్కొంది.

భర్తకు శఠగోపం.. మామతో కోడలు జంప్
ప్రేమించడం తప్పు కాదు కానీ.. వావివరసలు లేకుండా ప్రేమిస్తేనే ఛెండాలంగా, జుగుస్పాకరంగా ఉంటుంది. అయినా సరే.. ఇతర అభిప్రాయాల్ని పట్టించుకోకుండా, ప్రేమ గుడ్డిది అన్నట్టు వావివరసలు లేకుండా ప్రేమించేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్‌లోనూ అలాంటి వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మామ తన కోడలితోనే ప్రేమలో పడ్డాడు. తన కొడుకు భార్య అని చూడకుండా, కోడలితో ప్రేమాయణం నడిపించాడు. అటు ఆమె కూడా భర్త కళ్లుగప్పి.. మామతో రాసలీలలు కొనసాగించింది. చివరికి.. వీళ్లిద్దరు అతనికి శఠగోపం పెట్టి, ఇంటి నుంచి పారిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బుండీ జిల్లాలోని సిలార్ గ్రామంలో పవన్ వైరాగీ అనే వ్యక్తి తన భార్య, తండ్రి రమేశ్ వైరాగీతో నివాసం ఉంటున్నాడు. పవన్ దంపతులకు ఆరు నెలల చిన్న పాప కూడా ఉంది. పని నిమిత్తం భర్త బయటకు వెళ్తే.. ఇంట్లోనే ఉంటోన్న మామ, కోడలు మధ్య ప్రేమ చిగురించింది. దీంతో.. పవన్ లేని సమయంలో వాళ్లు రాసలీలలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి పారిపోయారు. దీంతో.. పవన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, తండ్రి ఇద్దరు లేచిపోయారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు.. తన భార్య అమాయకురాలని, మాయమాటలు చెప్పి తన తండ్రే ఆమెను తీసుకెళ్లాడని పేర్కొన్నాడు. తన తండ్రి ఇల్లీగల్ పనులు చేసేవాడని కూడా పవన్ తెలిపాడు. తన భార్యను ఎత్తుకెళ్లడమే కాకుండా, తన ద్విచక్ర వాహనాన్ని సైతం తండ్రి దొంగలించాడంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఇద్దరి ఆచూకీ కనుగొనాలని పవన్ పోలీసుల్ని కోరాడు. అయితే.. ఈ కేసుని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇప్పటివరకూ కేసు ముందుకు కదల్లేదని పవన్ ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి అర్వింద్ భరద్వాజ్ మాట్లాడుతూ.. తాము ఈ కేసుని శ్రద్ధగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దొంగలించబడ్డ ఆ ద్విచక్ర వాహనంతో పాటు పారిపోయిన ఆ జంట ఆచూకీ కనుగొనడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదిలావుండగా.. రాజస్థాన్‌లో ఇలాంటి వింత ఘటనలు చోటు చేసుకోవడం సహజమే! కొంతకాలం క్రితమే తన అల్లుడితో కలిసి 40 ఏళ్ల అత్త పారిపోయింది. మామ మత్తులో ఉన్నప్పుడు.. అత్తతో కలిసి అల్లుడు జంప్ అయ్యాడు.

అమెరికా అధ్యక్ష రేసులో ఇద్దరు భారతీయ-అమెరికన్లు..
చైనా టార్గెట్ గా అమెరికా అధ్యక్ష ఎన్నిలక ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున భారతీయ అమెరిక నిక్కీహేలీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మరోవైపు ఆదే పార్టీ నుంచి వివేక్ రామస్వామి కూడా పోటీలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇరువురు కూడా చైనా టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాము గెలిస్తే చైనాకు ఎలా బుద్ధి చెబుతామనే విషయాలను వెల్లడిస్తున్నారు. 2024లో తాను అమెరికా అధ్యక్షుడిని అయితే చైనాతో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలపై నిషేధం విధిస్తానని వెల్లడించారు. తాను కూడా అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానానికే మద్దతు ఇస్తానని అన్నారు. అమెరికా గుర్తింపు సంక్షోభంలో ఉందని, మనం చైనా నుంచి స్వాతంత్య్రం పొందాల్సి ఉందంటూ మాట్లాడారు. తాను అమెరికా మొదటి సంప్రదాయవాదినని, దేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలపాలని, అమెరికా అంటే ఏమిటో మనం ఇప్పుడు కనుగొనాల్సి ఉందని, అందకే తాను గతవారం అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించానని వెల్లడించారు. మనం చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలనుకెుంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) పడిపోయే వరకు చైనాలో వ్యాపారం చేయకుండా యూఎస్ సంస్థలను నిషేధించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

NTR 30: మరో 24 గంటల్లో పాన్ ఇండియా అప్డేట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. గత దశాబ్ద కాలంలో ఏ సినిమా కోసం వెయిట్ చెయ్యనంతగా ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం ఎప్పుడు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? లాంటి అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో హంగామా చేశారు. తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొని వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్తున్నాడు. మార్చ్ 16న ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ 30 గురించి ఇంటరెస్టింగ్ విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపే నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ 30 నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రానుంది. ఎన్టీఆర్ ఫాన్స్ కి మాత్రమే కాదు బాలీవుడ్ వర్గాలకి కూడా మంచి కిక్ ఇచ్చే ఆ న్యూస్ ఏంటి అంటే… ఎన్టీఆర్ 30 సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ కొరటాల శివ, జాన్వి ఫోటోషూట్ ని కూడా చేశాడు. మార్చ్ 6న జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో, ఆ రోజు ఒక వీడియోతో జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారని సమాచారం. నటీ నటుల పరంగా ఎన్టీఆర్ 30 నుంచి వస్తున్న ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చాలా సార్లు చెప్పిన జాన్వి కపూర్, ఎట్టకేలకు తన ఫేవరేట్ హీరో సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మరి కొరటాల శివ, జాన్వి కపూర్ అప్డేట్ ని ఎంత స్పెషల్ గా డిజైన్ చేశాడో తెలియాలి అంటే మార్చ్ 6 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

 

  • Tags
  • LATEST TELUGU NEWS
  • Top Headlines
  • Top News

WEB STORIES

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

RELATED ARTICLES

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @9PM: టాప్ న్యూస్

తాజావార్తలు

  • Kantharao : దాసరిని కాంతారావు ఎందుకు కొట్టారు!?

  • Shobhan Babu: యన్టీఆర్ ను ఫాలో కాలేక పోయిన శోభన్ బాబు!

  • Hansika Motwani: పెళ్ళైనా ఇంకా అందాల ఆరబోత చేస్తున్నావ్ .. ‘దేశముదురు’వే

  • Sonakshi Sinha: నిమ్మపండు రంగు డ్రెస్ లో స్టార్ డాటర్ వయ్యారాలు పోతుందిగా

  • Neha Shetty: మనసులను విరకొట్టే మెషిన్ వి రాధిక నువ్వు

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions