Turkey Earthquake: టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. గత నెలలో టర్కీ, సిరియాలో భూకంపం సంభవించగా.. ఒక్క టర్కీలోనే 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టం అంచనా వేయబడిందని ఐక్యరాజ్యసమితి మంగళవారం తెలిపింది. టర్కీలోని గాజియాంటెప్ నుంచి వీడియో లింక్ ద్వారా యూఎన్‌డీపీకి చెందిన లూయిసా వింటన్ విలేకరులతో మాట్లాడుతూ.. నష్టం 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుదన్నారు. ఫిబ్రవరి 6న సంభవించిన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం, దాని ప్రకంపనల కారణంగా టర్కీలో 45,000 మందికి పైగా.. పొరుగున ఉన్న సిరియాలో 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచ బ్యాంకు గత వారం నష్టాన్ని అంచనా వేసింది. ప్రపంచబ్యాంకు ప్రకారం 342 కోట్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 2.80 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాంకు అంచనా ప్రకారం ఈ ఏడాది జీడీపీలో కనీసం 0.50 శాతం నష్టపోయినట్లు అంచనా వేసింది. కాగా ఈ ఏడాది దేశ జీడీపీ 3.5 శాతం నుంచి 4 శాతంగా నమోదు కావచ్చునని వెల్లడించింది. ప్రస్తుతం కూలిపోయిన ఈ భవనాలు నిర్మించాలంటే రెట్టింపు వ్యయం అవుతుందని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇక పొరుగున సిరియాలో పరిస్థితి తీసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది.
Read Also: Rahul Gandhi: అమెరికా, యూరప్ జోక్యం కోరిన రాహుల్.. తీవ్రంగా స్పందించిన బీజేపీ
కానీ టర్కీ ప్రభుత్వం యూఎన్‌డీపీ, ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ యూనియన్ మద్దతుతో చాలా ఎక్కువ నష్టాన్ని లెక్కించిందని వింటన్ చెప్పారు. ఈ లెక్కింపు అంచనాలు పూర్తయిన తర్వాత బ్రస్సెల్స్‌లో రికవరీ, దాతల సమావేశంలో ఈ నష్టాన్ని చెప్పి సాయం ప్రకటించమని కోరనున్నారు.