Crime News: యువకుడి దారుణం.. తండ్రిని నరికి చంపి, సవతి తల్లిపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఒడిశాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని నరికి చంపి, ఆపై సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన టోమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. సవతి తల్లి తన తండ్రి వద్ద ఉండనివ్వకపోవడంతో ఆ వ్యక్తి వేరే గ్రామంలో నివసించాడు. ఆదివారం రాత్రి తన తండ్రి ఇంటికి వెళ్లిన అతడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.
Read Also: Police Torture: దారుణం.. పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
రెచ్చిపోయిన ఆ యువకుడు సవతి తల్లిలో ఓ విషయంలో వాగ్వాదానికి దిగగా.. తండ్రి జోక్యం చేసుకుని భార్యకు మద్దతుగా మాట్లాడాడు. కొద్దిసేపటికే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఆ యువకుడు తన తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. ఆ వ్యక్తి తన 65 ఏళ్ల తండ్రిని పదునైన ఆయుధంతో హతమార్చాడు. ఆ తర్వాత అతను తన సవతి తల్లిపై అత్యాచారం చేసి, ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు టోమ్కా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే పాత్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య, అత్యాచారానికి దారితీసిన ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సవతి తల్లి అతడిని తన తండ్రితో ఉండడానికి అనుమతించలేదని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!