న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ముంజ్రేకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని... అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భారత జట్టు ఓపెనర్ పృథ్వీ షా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. పృథ్వీ షా ఇటీవల ఓ మోడల్‌తో వివాదం కారణంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. పృథ్వీ దీనిపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు.
బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. బహ్రైన్-కోజికోడ్-కోచి సర్వీస్‌లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని వయనాడ్(కేరళ)కు చెందిన షఫీగా గుర్తించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా టీ 6 , ఎఫ్ 24 అనే రెండు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
ఒకప్పుడు ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. జనాభా తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం పొరుగున ఉన్న చైనా ప్రవేశపెట్టిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా ఆ దేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మళ్లీ జనాభాను పెంచేందుకు డ్రాగన్ అవస్థలు పడుతోంది.
మాజీ మంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలులోని జైలు నంబర్ 1లో అత్యంత భయంకరమైన నేరస్థులలో ఉంచబడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.