Viral Video: పారాగ్లైడింగ్‌లో అపశ్రుతి.. విద్యుత్ స్తంభంపై ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: కేరళలోని ఓ బీచ్‌లో అవుట్‌డోర్ అడ్వెంచర్ చేయడానికి ప్లాన్ చేసిన ఇద్దరు పర్యాటకులు తమ పారాచూట్ అనుకున్న చోట దిగకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతంలోని వర్కాలలోని పాపనాశం బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్న ఓ వ్యక్తి, ఓ మహిళకు సంబంధించిన పారాచూట్ విద్యుత్ స్తంభానికి చిక్కుకోవడంతో వారు గట్టిగా కిందపడకుండా స్తంభాన్ని పట్టుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పారాగ్లైడర్లు 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన స్తంభం నుంచి కింద పడకుండా ప్రయత్నిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు రక్షించబడటానికి ముందు దాదాపు రెండు గంటల పాటు స్తంభానికి వేలాడుతూనే ఉన్నారు. అగ్నిమాపక శాఖ వద్ద తగినంత ఎత్తులో నిచ్చెన లేనందున వాటిని తీసుకొచ్చేవరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా స్తంభం కింద పరుపులు, వలలను అధికారులు అమర్చారు. ఆ తర్వాత 28 ఏళ్ల మహిళ, పారాగ్లైడింగ్ శిక్షకుడు సురక్షితంగా రక్షించబడ్డారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ వర్కాలలోని తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Also Read
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
Read Also: Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి
పారాగ్లైడింగ్ ఘటనలు భయానక ప్రమాదాలుగా మారడం ఇది మొదటిసారేం కాదు. గతేడాది డిసెంబర్‌లో దేశంలో జరిగిన రెండు వేర్వేరు పారాగ్లైడింగ్ ఘటనల్లో 24 గంటల్లోనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో పారాగ్లైడింగ్ చేస్తుండగా 50 అడుగుల కింద పడి 50 ఏళ్ల దక్షిణ కొరియా వ్యక్తి మరణించగా, మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల పర్యాటకుడు హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని దోభి ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేస్తూ పడి మరణించాడు.
#WATCH | Kerala: A man and woman met with an accident while paragliding when they got stuck on a high mast light pole in Varkala in rural Thiruvananthapuram. Both the tourists were rescued & were shifted to the hospital. pic.twitter.com/nQVH5yZuMz
— ANI (@ANI) March 7, 2023
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!