TSRTC: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా టీ 6 , ఎఫ్ 24 అనే రెండు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. హైదరాబాద్ జీఎచ్ఎంసీ పరిధిలో రూ. 50 రూపాయల టికెట్‌తో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు మహిళలు, సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేసేలా టీ 6 టికెట్ ను తీసుకొచ్చింది. ఇక శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్ లో ఒక ఫ్యామిలీలో నలుగురు రూ. 300 రూపాయలతో ఒక రోజంతా ప్రయాణం చేసేందుకు ఎఫ్ 24 టికెట్ ను TSRTC తీసుకొచ్చింది. టీ 6, ఎఫ్ 24 ఆఫర్లకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్‌లో విడుదల చేశారు. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు రేపటి నుంచి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌లో తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఆర్ఎస్ టీ 6, ఎఫ్ 24 ఆఫర్లు ప్రకటించింది.
వీకెండ్, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఎఫ్-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే బస్సుల్లో టి-24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం టి-24 టికెట్ ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది.
Read Also: Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
కాగా,గ్రేటర్ పరిధిలో ఓఆర్ మెరుగు పరచుకునేందుకు టీఆర్ఎస్ ఆర్టీసీ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటే 10 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ చివరి వరకు బుకింగ్ చేసుకుంటే అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులను రాయితీపై వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసి ఇబ్బందులు పడకుండా సురక్షితంగా, సుఖమయంగా అతిడతక్కువ ఖర్చుతో ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.