JC Prabhakar Reddy: తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు..
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇక, తాడిపత్రి భూమి మీద ఉన్న శక్తిని చాటుతూ, “ఇక్కడ సూర్యశక్తి (సోలార్) ప్రాజెక్ట్‌ను రెండు నెలల్లో పూర్తిచేస్తాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి నెలకు 20 లక్షల ఆదాయం వస్తుంది,” అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరోవైపు.. నా శత్రువు కూడా నా గురించి ఆలోచించి మాట్లాడే విధంగా చేసుకోవడం నా కోరిక.. ఎక్కడైనా, తాడిపత్రిలో బ్రతకలేని వ్యక్తి దేశంలో ఎక్కడ బ్రతకలేడు, అని ఆయన తమ పట్టణం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్తు అభివృద్ధిపై గౌరవంతో మాట్లాడారు. ఆయన మున్సిపాలిటీకి సౌరశక్తి ఆధారిత ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు..
మరోవైపు, తాడిపత్రి పట్టణంలో 4 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. జేసీ పార్కు వద్ద 40 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి లేదు… సంక్షేమ పథకాలు అమలు చేసేందుకే రాష్ట్ర ఆదాయం సరిపోతుందన్నారు. తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే… ఖర్చులు పైసా పైసా ఆదా చేస్తూ… పరిశ్రమలు తీసుకొస్తున్నాం. సోలార్ ఏర్పాటు అయితే మున్సిపాలిటీ కి నెల నెలా 22 లక్షలు డబ్బులు ఆదా అవుతుంది. తాడిపత్రి త్వరలో డ్రీమ్ సిటీ గా మారబోతోంది.. ఏడాది తర్వాత తాడిపత్రి రూపురేఖలు మారిపోతాయని తెలిపారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!