ICC World Test Championship: న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ముంజ్రేకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో గెలిస్టే ఇండియా నేరుగా ఫైనల్ వెళ్తుందని ఆయన జోస్యం చెప్పారు. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ ఇండియా ఓడిపోయిన.. మ్యాచ్ డ్రా చేసుకుంటే.. అటు న్యూజిలాండ్ పై శ్రీలంక 2-0తో గెలిస్తే భారత్ ను వెనక్కి నెట్టి లంకేయులు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటారు.
అయితే ఈ రెండు మ్యాచ్ లు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. తొలి రోజే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా-భారత్ నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ శ్రీలంక జట్టుపై కామెంట్స్ చేశారు. న్యూజిలాండ్ ను వాళ్ల స్వదేశంలో ఓడించే సత్తా లేదన్నారు. ఆసీస్-భారత్ చివరి టెస్ట్ అద్భుతంగా ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యనించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని ముంజ్రేకర్ పేర్కొన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరువలో ఇండియా ఉందని కామెంట్స్ చేశారు. తప్పకుండా ఇండియానే డబ్య్లూటీసీ ఫైనల్ కు వెళ్తుందని ముంజ్రేకర్ అన్నారు.
Read Also: Prithvi Shaw: పృథ్వీ షాకు ఏమైంది..?
ఇండియా ఇప్పటికే ఫైనల్ చేరిందని దాన్ని తాను నమ్ముతున్నాను.. కానీ అధికారికంగా వెళ్లాల్సి ఉంది అని సంజయ్ ముంజ్రేకర్ పేర్కొన్నారు. అంతే్కాకుండా ఈ సిరీస్ విజేత కేడా తేలాల్సి ఉందన్నారు. ఇండోర్ లో ఆస్ట్రేలియా బలంగా పుంజుకుంది.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఇరు దేశాల ప్రధానులు రావడంతో ఈ టెస్ట్ మ్యాచ్ కు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఈ చివరి టెస్టులోనూ ఆసీస్ బ్యాటర్లు మెరుగ్గా ఆడుతున్నారు. టాస్ గెలిచిన కంగారులు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ సెషన్స్ లో భారత్ హవా నడిచిన తరువాత రెండో సెషన్ లో ఇండియాకు ఒక్క వికెట్ ఇవ్వకుండా ఆసీస్ బ్యాటర్లు జాగ్రత్త పడ్డారు. దీంతో రెండో సెషన్ లో కంగారుల జట్టే పై చేయి సాధించింది.
ఆస్ట్రేలియా 2021-23 డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటి వరకూ 18 టెస్టులు ఆడి 11 విజయాలు సాధించింది. అందులో మూడు ఓడిపోగా.. 4 మ్యాచ్ లుగా డ్రాగా ముగిశాయి. 68.52 పర్సంటేజ్ పాయింట్లతో ఆసీస్ జట్టు డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ లో ఉంది. ఇక టీమిండియా ఇప్పటి వరకూ 17 టెస్టుల్లో 10 విజయాలు సాధించి.. ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కాగా.. రెండు మ్యాచులను డ్రా చేసుకుంది. ఇండియా పర్సంటేజ్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. చివరి టెస్టులో విజయం సాధిస్తే భారత్ నేరుగా ఫైనల్ చేరుపోతుంది. మరోవైపు శ్రీలంక పది మ్యాచుల్లో 5 విజయాలు.. 4 ఓటములు, ఒక డ్రాతో మూడో స్థానంలో ఉంది. శ్రీలంక టీమ్ న్యూజిలాండ్ ను 2-0 తేడాతో ఓడిస్టే ఫైనల్ చేరుతుంది. ఆ లెక్కన డబ్య్లూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారత్ లేదా శ్రీలంక జట్టుతో తలపడనుంది.